Mitchell Starc bowls 5 dot balls, defends 10 in epic last over against Andre Russell
#AndreRussell
#Russell
#Wivsaus
#Starc
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన నాలుగో టీ20లో సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో రస్సెల్ అత్యుత్సాహం కారణంగా విండీస్ ఓడిపోయింది. చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సి ఉండగా.. ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన రస్సెల్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి జట్టు ఓటమికి కారణమయ్యాడు. యార్కర్ బాల్స్ ఆడలేననే తన బలహీతనను మరోసారి చాటి చెప్పాడు. దాంతో రస్సెల్‌పై అభిమానులు మండిపడుతున్నారు. క్విక్ సింగిల్స్, డబుల్స్ తీసినా మ్యాచ్ గెలిచేదని, రస్సెల్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓటమి పాలవ్వాల్సి వచ్చిందని కామెంట్ చేస్తున్నారు.