Dinesh Karthik Fined For Breaching IPL Code Of Conduct During Qualifier 2 Against DC
#IPL2021Finals
#CSKVSKKR
#DineshKarthik
#MSDhoni
#IPL2021Titlewinner
రెండుసార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే ఫైనల్‌కు వెళ్లిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. క్వాలిఫయర్ 2 మ్యాచులో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కేకేఆర్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేష్ కార్తీక్‌కు జరిమానా పడింది. షార్జా వేదికగా గత రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 ఓవర్ వేసిన కాగిసో రబడా బౌలింగ్‌లో కార్తీక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు నితీష్ రాణా, గిల్ ఔట్ అవ్వడంతో.. అసహనానికి లోనైన కార్తీక్ స్టంప్స్‌ను బ్యాటుతో కొట్టి పెవిలియన్ చేరాడు. ఇది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. దాంతో డీకేకు జరిమానా విధించారు.