పాకిస్తాన్ ప్రోత్సాహిత జైషె మహ్మద్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని అవంతిపొరలో సృష్టించిన మారణ హోమానికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన మెరుపు దాడి.. బాలాకోట్ వైమానిక దాడులు. ఈ వైమానిక దాడులకు నాయకత్వాన్ని వహించిన అప్పటి వైమానిక దళ వింగ్ కమాండర్, గ్రూప్ కేప్టెన్‌గా పదోన్నతి పొందిన అభినందన్ వర్థమాన్.. తాజాగా వార్తల్లోకి ఎక్కారు. రక్షణ రంగంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన వీర చక్రను అందుకున్నారు. దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
#AbhinandanVarthaman
#VirChakra
#RamNathKovind
#F16fighteraircraft
#WingCommander
#PMModi
#RajnathSingh
#Delhi