తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి, దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం మహావీర చక్ర పురస్కారం లభించింది. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లను నిలువరించే క్రమంలో వీరమరణం పొందారు. మాతృభూమిని కాపాడే ప్రయత్నంలో ఆయన చూపిన తెగువ, ధైర్య సాహసాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మరణానంతరం కల్నల్ సంతోష్ బాబు పేరును మహావీర చక్ర పురస్కారం కోసం ఎంపిక చేసింది.
#ColSantoshBabu
#MahavirChakra
#IndianArmy
#RamNathKovind
#Soldier
#Galwanvalley
#ChineseArmy