Virat Kohli may face some hardships in rohit sharma captaincy if he won't perform well in upcoming matches.
#ViratKohli
#RohitSharma
#Teamindia
#Bcci
బ్యాట్స్‌మన్‌గా తిరుగులేని ఆధిపత్యం చలాయించిన్నాళ్లూ భారత క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఎదురే లేకుండా పోయింది. అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజం కోచ్ అయ్యాక కోహ్లీతో విభేదాలొస్తే అతను తప్పుకోవాల్సి వచ్చింది కానీ.. కోహ్లీకి ఏ రకమైన ఇబ్బందీ రాలేదు. క్రికెట్ సలహా కమిటీ సభ్యుడైన సౌరవ్ గంగూలీకి రవిశాస్త్రి పట్ల ఏమాత్రం సానుకూల అభిప్రాయం లేకపోయినా.. కోహ్లీ మెచ్చాడు కాబట్టి అతన్నే కోచ్‌గా చేయాల్సి వచ్చింది. భారత క్రికెట్లో కోహ్లీ ఆధిపత్యానికి ఇవి సూచికలు.