చైనాలో వైద్యవిద్య చదివి మన దేశంలో అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కాకుండానే నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొందిన ఇద్దరు వైద్యులతో పాటు వారికి సహకరించిన వైద్యమండలి ఉద్యోగిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను అదనపు కమిషనర్(నేర పరిశోధన) ఎ.ఆర్.శ్రీనివాస్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.