కర్నూలు జిల్లా శ్రీశైలంలో టీ కొట్టు దగ్గర ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న గొడవ విధ్వంసానికి దారి తీసింది. శ్రీశైల క్షేత్రంలో అర్ధరాత్రి భయానక వాతావరణం ఏర్పడింది. కన్నడ భక్తులు ఆగ్రహంతో ఆలయ పరిసరాల్లో వీరంగం సృష్టించారు. షాపులను ద్వంసం చేసి.. నిప్పు పెట్టారు. కార్ల అద్దాలను పగులగొట్టారు. బైక్‌లను ధ్వంసం చేశారు. కన్నడ యువకుల దాడితో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేదు.