IPL 2022: Gujarat Titans Won IPL 2022 Title. Meanwhile RR Skipper Sanju Samson proud of Rajasthan Royals despite losing IPL 2022 final | ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్లో ఓడినా జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన సంజూ.. ముందుగా బ్యాటింగ్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచడంతో పాటు సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. భారీ స్కోర్ చేస్తే ప్రత్యర్థి ఒత్తిడికి గురవుతుందని భావించామన్నాడు. అయితే బ్యాటింగ్‌లో విఫలమవ్వడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఫైనల్ ఓడినా ఈ సీజన్ తమకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు.