బీజేపీ జీవీఎల్ నరసింహారావుకి మతి భ్రమించిందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీజేపీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని.. రాష్ట్రంలో ఆ పార్టీకి ఓటు, సీటు లేదని ఎద్దేవా చేశారు. సోము వీర్రాజు పోలీసులపై దౌర్జన్యం చేయడం దారుణమని.. తక్షణమే పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేనలు ఆంధ్ర రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారన్నారు.