కృష్ణా నదిలో మురుగునీరు నేరుగా కలువకుండా శుద్ధి చేసి వదలాలన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. తొలుత ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాల్సి ఉందని ప్రతిపక్ష సభ్యులు సూచిస్తున్నారు.