ICC Test rankings:Virat Kohli Falls Out Of Top 10 And Other side Rishabh Pant makes huge gain | బుధవారం ప్రకటించిన తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ కింగ్ కోహ్లీ మరోసారి దిగజారిపోయాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇటీవల ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్ట్‌లో వీరోచితంగా పోరాడిన పంత్ నంబర్ 5వ స్థానానికి చేరుకున్నాడు.ఇక పంత్ తన గత ఆరు టెస్ట్ ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఇటీవల టెస్టుల్లో అతని ఫామ్ వల్ల బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానం నుంచి ఆరు స్థానాలు ఎగబాకి అయిదో స్థానానికి చేరుకున్నాడు.