Congress Leader Madhu Yaskhi Goud About Munugode by-poll | తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు చాలా అవసరం. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తేనే, భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీకి పట్టు ఉంటుందని భావిస్తున్న రాజకీయపార్టీల నాయకులు మునుగోడులో జెండా ఎగరవేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉపఎన్నిక జీవన్మరణ సమస్యగా తయారయింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగా మునుగోడులో రంగంలోకి దిగి కార్యాచరణ మొదలుపెట్టింది. టిఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టేలా కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతోంది.