Paritala Sunitha: పరిటాల సునీత, శ్రీరామ్ లను అడ్డుకున్న పోలీసులు | DNN | ABP Desam

Abp Desam 2022-08-26

Views 13

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల పర్యటనలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కి చెందిన 50 కుటుంబాల మద్దతు దారులు మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో టీడీపీలో చేరనున్నారు. అందుకోసం వెళ్తుండగా కుంటిమద్ది చెరువు కట్టపై వారి వాహనాన్నిరాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి ఆపేసి.. వారిని దౌర్జన్యంగా తీసుకువెళ్లిపోయారు. అడ్డుపడిన టీడీపీ నేతలపై దాడులు చేశారు. ఈ సంఘటనపై నిరసన తెలియజేయడానికి వెళ్తున్న పరిటాల సునీత, శ్రీరామ్ లను రామగిరి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఆపేశారు. దీంతో.. నడి రోడ్డుపై కూర్చుని పరిటాల సునీత, శ్రీరామ్ లు నిరసన వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS