అనంతపురంలోని ఉమా నగర్ లో ఓ ఆటోమొబైల్ షాప్ లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. చాలా షాపుల్లో మంటలు వ్యాపించి పెద్దఎత్తున ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాల గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.