Third Front:Telangana CM KCR have many hurdles in his Third Front against pm modi Like Chandrababu in past | కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే సర్కార్ పై పోరు కోసం కేసీఆర్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్ని ఆశ్రయిస్తున్నారు. ఒక్కొక్కరు మద్దతిస్తామనే చెప్తున్నారు. కేసీఆర్ వెళ్లి వీరిని కలిసే సరికి ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే కేసీఆర్ తో కలిసి పోరాటం చేసేందుకు వీరు ఎంత మేరకు సిద్ధంగా ఉన్నారనేది తెలియదు.2019లో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు మొదలుపెట్టిన ధర్మపోరాటానికి కేంద్రం, రాష్ట్రాల్లో 21 జాతీయ, ప్రాంతీయ పార్టీలు మద్దతిచ్చాయి. ఈ పోరులో చంద్రబాబు దారుణంగా దెబ్బతిన్నారు. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో సరైన ప్రత్యామ్నాయం చూపించలేకపోవడమే. ఈ పోరులో చంద్రబాబుతో జత కట్టిన విపక్షాలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో చంద్రబాబు పోరు మోడీకి వ్యతిరేకంగా అతిపెద్ద విఫలయత్నంగా మిగిలిపోయింది. ఇప్పుడు కేసీఆర్ దాన్నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే.