kasani gnaneshwar joined in TDP on the presence of Chandrababu Naidu | తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాసాని జ్ఞానేశ్వర్ పసుపు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాసానికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. కాసాని 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఆయన ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు.
#KasaniGnaneshwar
#TDP
#Telangana
#ChandraBabuNaidu
#TRS