AP Minister Dadisetty Raja on today slams tdps demand on kapu reservations | కాపు రిజర్వేషన్లపై టీడీపీ చేస్తున్న డిమాండ్ పై ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు.వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని మంత్రి దాడిశెట్టి రాజా గుర్తుచేశారు. ఏ బీసీ కులాలకు తగ్గించమంటారో చెబితే అప్పుడు జగన్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండానే తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేయించిందన్నారు. చట్ట పరంగా నిలబడని తీర్మానాలు కేంద్రానికి పంపించారని మంత్రి ఆరోపించారు.ఇప్పుడు రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఏ బీసీ కులానికి రిజర్వేషన్లు తగ్గించి కాపులకు ఇవ్వాలో చెప్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
#DadiseettyRaja
#YSRCP
#TDP
#AndhraPradesh
#CMjagan