BRS Action Plan : మారిన పరిస్థితుల్లో పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు బీఆర్ఎస్ త్వరలోనే ఓ సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఎమ్మెల్యేల వలసల నేపథ్యంలో పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు అధినేత భావిస్తున్నట్లు సమాచారం. ఒడిదొడుకులు సహజమేనని, ప్రజలు అన్నింటిని అర్థం చేసుకుంటారని తనని కలుస్తున్న ప్రజాప్రతినిధులు, నేతలతో కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని వారికి సూచిస్తున్నారు.