డబ్బులు డబుల్‌ పేరుతో భారీ మోసం - ఆర్‌ఎంపీ వైద్యుడి నుంచి నగదు కాజేసిన బిహార్‌ ముఠా- అరెస్టు

ETVBHARAT 2024-06-26

Views 88

Money Fraud By Bihar Gang in Hyderabad : ప్రజలకు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా నేరగాళ్లు మాత్రం కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. అధిక లాభాల ఆశచూపి డబ్బు కాజేస్తున్నారు. ఉన్న నగదును రెట్టింపు చేస్తామని మాయ మాటలు చెప్పి మెుదట కొద్దిపాటి నగదును రెట్టింపు చేసి చూపిస్తారు. నమ్మకం కుదిరిన తర్వాత పెద్ద మెుత్తంలో నగదు మారుస్తామంటారు. భారీ నగదు చేతికి రాగానే ఆ డబ్బులతో పరారీ అవుతున్నారు. ఈ తరహాలో నగదును రెట్టింపు చేస్తామని మోసగిస్తున్న బిహార్‌ ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS