పేదరికం లేని సమాజం కోసం తొలి అడుగు : చంద్రబాబు

ETVBHARAT 2024-06-26

Views 43

AP CM Chandrababu Visit to Kuppam Day 2 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండోరోజుల పర్యటన ముగిసింది. రెండోరోజు ఉదయం కుప్పం ఆర్​ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సీఎంతో కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు చిత్తూరు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. అతిథిగృహం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సచివాలయ ఉద్యోగులకు విధులు కేటాయించారు. వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజల వివరాలు నమోదు చేసుకుని శాఖలవారిగా జాబితా రూపొందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS