సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్ కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డీఎస్ మృతిపట్ల సంతాపం తెలిపారు.