NSUI Calls For Educational Bharat Bandh On July 4th : నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ఈ నెల 4న విద్యా సంస్థల భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు అందుకూ ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్లీ బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు. పేపర్ లీకేజీపైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పైన బాధ్యత ఉందని తెలిపారు. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి నీట్ పరీక్షను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. కాగా కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాలను స్వాగతిస్తున్నాం అన్నా ఆయన వాటిని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. మిగతా పరీక్షలపై కూడా అనుమానం కలుగుతుందని చెప్పారు.