హైదరాబాద్ టూ యాదాద్రి సూపర్ ఎక్స్​ప్రెస్ హైవే కట్టబోతున్నాం : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ETVBHARAT 2024-07-04

Views 4.7K

Minister Komatireddy On Express Highway Between Hyderabad to Yadadri : హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లేందుకు ఎక్స్​ప్రెస్ హైవే నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. ఈ హైవే నిర్మిస్తే కేవలం 30నిమిషాల్లో ఉప్పల్ నుంచి యాదాద్రి వెళ్లొచ్చని తెలిపారు. యాదగిరిగుట్ట మండల పరిషత్​ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీపీ, ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను ఎంపీగా ఉన్నప్పుడు 100శాతం జాతీయ రహదారులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జిల్లాలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. ఎంపీగా గెలిపించినప్పుడే చాలా పనులు చేసిన తాను ఇప్పుడు మంత్రి అయ్యాడని రెట్టింపు పనులు చేస్తానని హామీ ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS