Ministers on Sarpanch and ZP's Tenure in Telangana : రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు. సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీల కాల గడువు ముగిసినందున క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతతో పని చేయాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రజా సమస్యనైనా తమ దృష్టికి తేవాలని అమాత్యులు సూచించారు. పదవీ కాలం ముగిసిన ప్రజాప్రతినిధులు, నిత్యం జనహితంగా పని చేయాలని మంత్రులు ఉద్బోధించారు.