Govt Decision to Provide Free Books to Inter Students: ఇంటర్ విద్యార్ధులకు పుస్తకాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో చదువుకోవడానికి పుస్తకాలు ఇవ్వలేదన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్ధుల వద్ద తాము పుస్తకాలు తీసుకుని చదువుకునే వాళ్లమని వాపోతున్నారు. తమకు పుస్తకాలు ఇస్తే ఇంకా బాగా చదువుకుంటామని అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్ధి సంఘాలూ హర్షం వ్యక్తం చేస్తున్నాయి.