Rain Water Effect In Krishna Nagar : వానొచ్చిందంటే చాలు వరదొస్తది. వరద కేవలం అక్కడి గల్లీల్లోనే కాదు జనం వాట్సప్ స్టేటస్‌లోకీ వస్తుంది. ఎందుకంటే వచ్చే వరద ఊరికే రాదు వస్తు వస్తూ తనతో పాటు వాహనాలను, వస్తువులను మోసుకొస్తది. ఓ సారి ఏకంగా గుడి మండపమే ప్రవాహంతో పాటు వెళ్లిపోయింది. అందుకే అక్కడి జనం కూడా పెంపుడు జంతువుల్లాగా వాహనాలను ఇళ్ల ముందు కట్టేసుకుంటారు. వానొచ్చేటప్పుడు బయటికెళ్లిన వారు వాట్సప్ చూస్తే చాలు ఇంటికెళ్లాలో వద్దో నిర్ణయించుకుంటారు. ఇదంతా ఎక్కడో కాదు హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, సంపన్నులు నివాసం ఉండే కృష్ణానగర్ దుస్థితి. చినుకుపడితే చాలు విలవిల్లాడుతున్న కృష్ణానగర్ వాసులు వరద కష్టాలపై ప్రత్యేక కథనం.