TG Govt Focus On Skill University : తెలంగాణ నైపుణ్య విద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు చట్టం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దిల్లీ, హరియాణా తరహాలో స్కిల్ యూనివర్సిటీకి పరిశ్రమలశాఖ ముసాయిదా బిల్లును తయారు చేసింది. పరిశ్రమల అవసరాలకనుగుణంగా యువతను తీర్చిదిద్ది ఉద్యోగాలు కల్పించే సమున్నత లక్ష్యంతో దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.