తెలంగాణలో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు - దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

ETVBHARAT 2024-07-21

Views 49

Guru Purnima Celebrations in Telangana : హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. గురుపౌర్ణమి పురస్కరించుకుని హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. నల్గొండ జిల్లా చిట్యాల, నార్కట్‌పల్లి సాయిబాబ, వేణుగోపాల స్వామి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకులు ఘనంగా జరిగాయి. ముషంపల్లి, రామగిరిలోని సాయిబాబా ఆలయాలు సాయినామస్మరణతో మారుమోగాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS