Andhra Pradesh Assembly Sessions 2024: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. దాదాపు 5 రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రభుత్వం 3 శ్వేత పత్రాలను విడుదల చేయనుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ, ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది.