Polavaram Project Funds: పోలవరం తొలిదశ పనులను వేగంగా పూర్తి చేయడానికి 12 వేల 157 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రతినిధి బృందంతో చర్చల తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఈ అంశంపై సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, ఎన్టీయే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, పనుల్ని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాయం చేసేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని రాష్ట్ర ప్రతినిధులు తెలిపారు.