SELF EMPLOYER NIKHIL FROM KARIMNAGAR : కుటుంబం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో బీటెక్ తర్వాత పై చదువులకు వెళ్లాలి అనుకున్న ఆశలకు బ్రేక్ పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నకంపెనీలో ఉద్యోగంలో చేరినా, వచ్చే కాస్త జీతం సరిపోక నానా తంటాలు పడ్డాడు ఆ యువకుడు. దీనికి పని ఒత్తిడి తోడవడంతో, ఏం చేయలేననే అనుకున్నాడు. కానీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ భూతమే తనకో దారి చూపింది. ఆర్థిక కష్టాల్లోంచి గట్టెక్కించి సొంతకాళ్లపై నిలబడేలా చేసింది. ఇంతకీ అతడేం చేశాడో తెలుసుకోవాలనుందా? ఐతే ఈ స్టోరీ చూసేయండి.