CM Chandrababu Delhi Tour: సీఎం చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం పనుల వేగవంతంపై కేంద్ర మంత్రితో చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు చర్చించారు. ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని నిమ్మల రామానాయుడు తెలిపారు.