Women Commission Investigate KTR : మహిళలను గౌరవించాలని విచారణకు వచ్చానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. విచారణకు వస్తే మహిళా కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ మహిళా నేతలపై దాడి చేశారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ కేటీఆర్‌ను విచారించింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మహిళా కమిషన్ ఆదేశం మేరకు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యానని అన్నారు. తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశానని పేర్కొన్నారు. అంతకు ముందు విచారణకు హాజరైన కేటీఆర్‌కు మహిళా కమిషన్ సభ్యులు రాఖీ కట్టారు. కేటీఆర్ విచారణ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మహిళా సభ్యుల మధ్య పరస్పరం తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది.