Heavy Rains in AP : అల్ప పీడన ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాలకు ఉమ్మడి గుంటూరు జిల్లా తడిసిముద్దైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి రవాణా సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు వరదలో చిక్కుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.