Rain in Mahabubabad Today : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఇనుగుర్తిలో అత్యధికంగా 29.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో మహబూబాబాద్-నెల్లికుదురులతో పాటు పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. రావిరాలలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది.