ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్

ETVBHARAT 2024-09-25

Views 0

Minister Uttam Kumar Reddy Tour In Mahabubnagar : దశాబ్దాలుగా వెనుకబడిన, వలసలకు పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని ఈ శాసనసభ కాలంలోనే పూర్తి చేసి 12లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్థిక, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ఉదండాపూర్ జలాశయాన్ని ఆయన సందర్శించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS