దొంగతనం అంటే తాళం పగులగొట్టాల్సిన అవసరం లేదు. కిటికీఊచలూ తొలగించనక్కర్లేదు. ఖాతాల్లో డబ్బుంటే చాలంటున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతూ అమాయకులను లూటీ చేస్తున్నారు. కళ్లు మూసి తెరిచేలోపు ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఫెడెక్స్ పార్సిల్ పేరిట ఇప్పటికే కోట్లు కాజేశారు. ఐనా వారి ఆగడాలు ఆగడం లేదు.