YSRCP Leader Sajjala Ramakrishna Reddy No Answer to Questions in Police Enquiry: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు విచారించారు. సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సజ్జలను మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, గ్రామీణ సీఐ శ్రీనివాసరావు ప్రశ్నించారు. పోలీసులు ముందే సిద్ధం చేసుకుని అడిగిన 38 ప్రశ్నలకు సజ్జల సరైన సమాధానం ఇవ్వకుండా తెలియదు, గుర్తు లేదని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.