Massive Fraud in Peddapalli Post Office : ఈ మధ్యకాలంలో పోస్ట్ ఆఫీస్‌లలో ప్రవేశ పెట్టిన పొదుపు స్కీమ్స్‌లో చాలా మంది చేరుతున్నారు. ప్రభుత్వ సంస్థ అని అందులో పొదుపు చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, భవిష్యత్తులో పిల్లల జీవితాలకు ఒక భరోసా ఉంటుందని స్కీమ్‌లలో చేరి డబ్బులు జమ చేస్తున్నారు. ఒక్కసారి పిల్లల పేర్లపై ఫిక్స్ డిపాజిట్ చేస్తే భవిష్యత్తులో ఒకేసారి ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో వారి చదువులకో, లేక పెళ్లికో ఉపయోగపడతాయని భావించి లక్షల కొద్ది డబ్బును స్కీమ్ కింద డిపాజిట్ చేస్తున్నారు. చేసిన కష్టాన్ని పిల్లల జీవితాల కోసం వెచ్చిస్తున్నారు. అలాంటి వారిని బురిడి కొట్టించి అయామక ప్రజల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.