DRI Seized Rs 7 Crore Drugs At Shamshabad : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 7.10 కిలోల హైడ్రోఫోలిక్ వీడ్‌ను అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిద్దరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివారాలు తెలియాల్సి ఉంది.