శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని... స్వామివార్ల దర్శన అనంతరం మీడియాతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీశైలంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు ఆనం, కందుల దుర్గేష్, జనార్దన్‌రెడ్డిలతో కమిటీ వేయనున్నట్లు తెలిపారు.