నిర్మల్ జిల్లాలో పెద్దపులి సంచారం

ETVBHARAT 2024-11-11

Views 15

Tiger Wandering In Nirmal District : నిర్మల్ జిల్లా అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్దపులి సంచారం కొన్ని రోజుల నుంచి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్​లో ఆదివారం రాత్రి పెద్ద పులి రహదారి దాటుతుండగా అటువైపు వెళ్తున్న వాహనదారులు వీడియో తీశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు రాత్రి నుంచి వాహనదారులు మహబూబ్ ఘాట్ మార్గం గుండా వెళ్లకుండా ఇరువైపులా రోడ్లు మూసివేశారు. పులి ఇక్కడి నుంచి వెళ్లిందని ఊపిరి పీల్చుకున్న తరుణంలో మళ్లీ ఆదివారం రాత్రి సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్​లో కనబడింది. పులి సంచరిస్తున్నట్లు కొంతమంది ప్రత్యక్షంగా చూసి వీడియో తీయడంతో భయాందోళనలకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని ఏదో ఒక చోట పెద్ద పులి కనిపిస్తూ ఉందనే వార్త ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS