'మేము కలెక్టర్‌పై దాడి చేయలేదు, మాకు ఏమీ తెలియదు' - ప్రెస్‌మీట్‌లో లగచర్ల గ్రామస్థుల వెల్లడి

ETVBHARAT 2024-11-14

Views 0

Lagacharla Villagers On Pharma City : వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఇటీవల జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన కలెక్టర్‌, ఇతర రెవెన్యూ సిబ్బంది వాహనాలపై స్థానికులు దాడి చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇది రాజకీయ కుట్రలో భాగంగానే జరిగినట్లుగా అనుమానిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో లగచర్ల గ్రామస్థులు స్పందించారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS