ప్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన స్థిరాస్తి సంస్థ - 600 మంది బాధితుల నుంచి దాదాపు 150 కోట్లు వసూలు
గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ చేసిన విధ్వంసం, అవినీతిని ఇప్పటికే చర్చించామని, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ, బ్రాండ్‌ను దెబ్బతీసేలా ప్రవర్తించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించారని దుయ్యబట్టారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీటు కూడా తన దగ్గర ఉందన్న సీఎం అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.