BRS MLC Kavitha On Students Deaths : గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం 10 నిమిషాలైనా సమయం కేటాయించాలని, ఫుడ్ పాయిజన్ కరెంట్ షాక్, ఆత్మహత్యలతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. శనివారం నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వాంకిడి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని శైలజాను కవిత పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.