Hydra Focus On Lakes : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ సంచలనంగా మారిన హైడ్రా అయోమయంలో పడింది. నగరంలోని చెరువులు, కుంటల లెక్క తెలియక సందిగ్ధంలోకి వెళ్లింది. ఆ విషయాన్ని స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. తొలిదశలో కూల్చివేతలతో భయపెట్టిన హైడ్రా రెండో దశలో చెరువులను పునరుద్దరించడమే లక్ష్యంగా వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు రంగనాథ్ వెల్లడించారు.