Fisherman stuck in a pond pipe : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చెరువు తూములో ఇరుక్కున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మధిర మండలం సిరిపురం అనే గ్రామానికి చెందిన యంగల రాజు అనే మత్స్యకారుడు చేపల వేటకోసం వెళ్లాడు. ఇదే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువు తూములో చిక్కుకున్నాడు. సమాచారమందుకున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై జేసీబీల సహాయంతో రాజును బయటకు తీసేందుకు సహాయక చర్యలను చేపట్టారు.