452 Dishes for Son In Law in Eluru District : గోదారోళ్లు అంటే ఆతిథ్యానికి మారుపేరు. ప్రతి మాట చివర సాగదీత అందులో వెటకారం కలబోత కానీ మమకారం మాత్రం కుండపోత. అందులోనూ పండగ వచ్చిందంటే చాలు ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటలతో వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. బంధువులకు రకరకాల వెరైటీలతో కడుపు నింపేదాకా ఊరుకోరు. ఇక కొత్త అల్లుళ్లలకు అయితే ఆ మర్యాదల గురించి చెప్పక్కర్లేదు. కొత్త బట్టలు, పిండి వంటలు అవీ ఇవీ అని ఆ హడావుడే చెప్పనక్కర్లేదు.