నాపై, నా భార్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు : డీఎస్పీకి మనోజ్ ఫిర్యాదు

ETVBHARAT 2025-01-16

Views 2

Hero Manchu Manoj Went To Chandragiri Police Station To Meet DSP : నటుడు మంచు మనోజ్​ ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. బుధవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో డీఎస్పీని కలిశారు. తిరుపతిలోని మోహన్​బాబు యూనివర్సిటీకి వెళ్లినప్పుడు చోటుచేసుకున్న పరిణామాలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన భార్య మౌనికపైనా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటిలోకి తనను ఎందుకు అనుమతించడం లేదని పోలీసు అధికారులను ప్రశ్నించగా, శాంతిభద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS