'ఆ సర్వే ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు - అర్హత ఉండి రాకుంటే ఇలా చేయండి'

ETVBHARAT 2025-01-17

Views 13

Minister Ponnam Prabhakar Clarity On New Ration Cards : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కుల సర్వే సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తాయని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని రాష్ట్ర ప్రజానీకానికి సూచించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2 కోట్ల 90 లక్ష రేషన్​ కార్డులున్నాయని తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS